నా ఆలోచనలు
మెదడులో తిరుగుతుంటాయి
మనిషిగా మారుస్తుంటాయి
నాకు గొప్ప వరంగా దొరికాయి
నన్ను నాకు పరిచయం చేశాయి
నా ఆలోచనలే నాకు సగం బలము
ఎవరిని నొప్పించని తీరే సుగుణము
మాట తీరే మర్యాదపూర్వకము
నాకు అదే ఒక గొప్ప వరము
వేదాంతిలా ఆలోచిస్తాను
వేరు భావాలు నింపుకుంటాను
వేదికలా భావిస్తాను నేనున్న ప్రదేశాన్ని
వేడుకలా సమయాన్ని గడుపుతాను
భారంగా భరిస్తాను
బయటకు బాధలు కనపడనీయను
బాధను గుండెల్లో మోస్తాను
అంతా మన మంచికే అని సర్దుకుపోతాను
Also Read : నా కల
