Dissolving the Dreams : కరిగిపోతున్న కలలు

కరిగిపోతున్న కలలు

 

కరిగిపోతున్న కలలు

అణగారిన బ్రతుకులు కొన్ని
విషాదమే వారి యావదాస్తి.
బ్రహ్మ నుదుటిపై వ్రాసిన వీలునామా!.
తరతరాలుగా సంక్రమిస్తూనే ఉంటుంది
వంటగదిలో గ్యాస్ లీకేజీ మరణాలు.

గడప దాటిన మరుక్షణంలోనే
శూలాల్లా గుచ్చే మగాడి చూపులు..
వ్యంగ్యంగా మాట్లాడే మాటలు
దేహం ఆహుతి అవుతుంటే
ఒంటిని రాసుకుని తిరిగే ఆకతాయిల
వింత వింత సరదాలు. కంపరం కలిగిస్తుంటే
నోరు మెదపలేని పరిస్థితిలో కొందరు.

అత్తా,మామల వరకట్న దాహం
ఆడపడుచు దాష్టీకం
భర్త అతి సరదాల కోరికలు.
కన్నతండ్రిని నిలువునా దోచేస్తుంటే
కన్నీటిని కన్నుల్లో దాచేసే ఓర్పు.
వారికి ఆ దేవుడు ఇచ్చిన ఆస్తి.

పరుగులు తీసే గడియారంతో
ప్రతి నిత్యం పోటీయే వారికి.
తరగని ఇంటి పనులతో
వచ్చిన అతిథులకు సపర్యలు చేస్తూ.

కలలు కరిగిపోతూ.
వాస్తవాలు వెంటాడుతుంటే
వెంటరాని సంతానంకు దూరంగా
అనాధాశ్రమాల్లో మగ్గిపోతున్న
నిరాశకు చిరునామాలు వారే.

అందరూ ఉన్నా అనాధలుగా జీవించే
అణగారిన బ్రతుకులే కొందరివి.
నుదుటి రాతను మార్చుకోలేని
బ్రహ్మ వ్రాతను దిక్కరించలేని నిర్బాగ్యులే.

 

Also Read : అణగారిన బ్రతుకులు

 

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!