అణగారిన బ్రతుకులు
మనిషి జాడలేక, గుండె పగిలిన
రహదారులుకిప్పుడు,
వలస బతుకులు తోడైనాయి కంటికి కనిపించని క్రిమి
వారి కాళ్ళ కింద నేల లాగేసింది
కడుపులో కదిలే ఎలుకలు సైతం
ఇనుప రేకుల నీడ కింద
నీరసించి పోతున్నాయి.
దాతల ఎముకలేని చేతులు
కాలే కడుపుల సంఖ్యను
లెక్కించడంలో ఓడిపోతున్నాయి.
గుప్పెడు మెతుకుల కోసం
వందల మైళ్లు ఎగిరొచ్చిన
వలస పక్షులకు
పూటకో సారి ఉదయించే
అవే లక్ష యక్ష ప్రశ్నలు
రేపు ఎలా గడుస్తుంది.
తనను కన్న వాళ్లను
తాను కన్న వాళ్లను
కాపాడుకునే తరుణం
అందుకే
రక్షణశాఖ కన్నుగప్పి చేస్తున్నారు రవాణాలేని రహదారి ప్రయాణం.
Also Read : ఏడడుగుల హరివిల్లు
