సంతోషాల హరివిల్లు
ఆర్ద్రత తడిమిన పొదరిల్లులు
మా లోగిల్లు
కన్నీరు తో తొడలని కమతాలు
మా హృదయాలు.
ఇంకిపోని స్వప్నాల్లో
రంగు రంగులను అద్దుకుని
పొద్దు లై పొడుస్తాయి
ప్రతీ చోటా
పలకరింతల వాకిళ్ళను
తడుముకుంటూ వెళతాయి
దరహాసపు పరిమళాలను జల్లుకుంటూ
వినువీధుల్లో విస్తరిస్తాయి
సాగుతున్న
జీవన మాధుర్యాలతో
క్షణాలెన్నో పూస్తాయి
సంతోషాల హరివిల్లుల తోరణాలు
మనస్సాకాశమంతా
వేలాడుతుంటాయి.
Also Read : రంగుల జీవితం
