Colorful life : రంగుల జీవితం

రంగుల జీవితం

 

రంగుల జీవితం

జీవితంలోని ఆనందాల వెల్లువతో
ఆకాశంలో రంగుల కలయికతో
ప్రేమలు నిండిన హృదయాలతో
కళకళలాడుతూ ఉండెనులే మది ఎంతో

పక్షుల రాగాలతో పొందెను ఆనందం
జంతువుల సహచర్యంతో మానసిక ఆనందం
అందమైన ప్రకృతియే మనకు ప్రియ నేస్తం
వేలకట్టలేని ఈ వినీలాకాసమే
దేవుడి వరంగా

పచ్చని పైరు భూమాతకు ఆభరణము
ఎర్రటి సూర్యుడు నుదుటిన తిలకము
చల్లని చంద్రుడు లోకానికి ఆదర్శము
ఇది అంతా అందమైన ఆలోచనయే

అమ్మలోని ఆప్యాయతకు నిదర్శనం
నాన్నలోని భాద్యతకిది గమనార్హం
ఎన్నెన్నో బంధాలు, హరివిల్లులో రంగుల్లా
ఎటెటో గమనాలు, గమ్యం చేరేలా

నిరాశ ఎందుకు నీకు,
మదిలో ఆలోచన ఎందుకు
ఇన్ని అందాలు నీ ముందు ఉండగా
ఇన్ని బంధాలు నిన్ను వెన్నంటి ఉండగా.

 

Also Read : హరివిల్లు

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!