Telugu Poem Harivillu : హరివిల్లు

హరివిల్లు

 

హరివిల్లై

ఏడు రంగులు ఏక ఛాపమై

నింగిలోన దర్శనమిస్తుంది

నేలతల్లి   పాదాలను ప్రేమరా ముద్దాడుతున్నట్టు

రంగులు రక రకాలైనా, ఒక్కటిగా కలిసిపోయి

 

కప్పేసిన దట్టమయిన మబ్బుల నుండి

చొచ్చుకొని వచ్చిన సూర్యకిరణాలలోనూ

చిరు చిరు చినుకుల చిలిపి అల్లరిలోనూ

ఒదిగిపోయి,  తానే చెప్పకనే చెపుతుంది

 

‘కుల, మత, జాతి, పేద, ధనిక, భాష, దేశాల

భేదాలు మరచి, స్నేహభావంతో మెలుగుతూ

సమసమాజ స్థాపనలో జీవితాలని వెలిగించే

ఇంద్రధనువై నీవే కనువిందు చేయగలవని’

 

చిట్టి పొట్టి చిన్నారుల అమాయకపు

కనుల విస్మయమై ఓలలాడుతూ

కన్నె మనసుల కలల సౌధాన్ని

ఆకాశ మార్గాన విహరింపజేస్తూ..

 

దుక్కి దున్ని పంటలు పండించు రైతన్న

తొలకరికై ఎడారి కన్నుల ఎదురు చూపులకు

ఆశల పూలు పూయిస్తూ

నిలిచి ఉంటుంది సంబరాల సంతోషాల హరివిల్లై!!

 

Also Read : విజయదశమి

Leave A Reply

Your Email Id will not be published!

error: TeluguISM content is copyright protected! Reproducing it in any form is subject to penalization!!!