My Goal : నా కల
నా కల
ఆకలిదప్పుల కుశలము మరచి
ఆశయం వైపుగా అడుగులేయించె
నా కల !
అదృష్టానికై వెర్రిగా అర్రులు చాచక
ఆలోచనల పందిరేసి అవకాశమందించె
రవి చంద్రుల దొంగాటను విస్మరించి
అక్షర ఊయలలోన మదిని జో కొట్టె
నా కల !
నీరుగార్చు అపనమ్మకాల నిగ్గుతేల్చి
తెగింపుకు ఉగ్గుపట్టి పెంచి పోసించె
నా కల !
బిక్కుమంటున్న ఓటమి భయాన్ని
గెలుపు బరోసాతో అడుగేయించె
నా కల !
పెదవివిరిచిన పేదరికాన్ని పక్కకునెట్టి
పట్టుదలతో లక్ష్యం వైపు పరిగెత్తించె
నా కల !
పగటికలంటు వెక్కిరించే ఒట్టిబుర్రల్ని
సవాలుచేస్తూ విజయం బాటపట్టించె
నా కల !
నిదురలో నను చేరి
నిదురకు నను దూరం చేసి
గమ్యాన్ని చేర్చిన నా కల
నా జీవితానికి సార్థకం ఈ వేళ నీ వల్ల !
Also Read : స్వయంకృషి