Telugu Poetry : అణగారిన బ్రతుకులు
అణగారిన బ్రతుకులు
ఎంగిలాకు
కడుపు కింత కూడు లేదు
తలదాచను గూడు లేదు
కట్టుకోను బట్ట లేదు
సెట్టు కింద సోటు లేదు
కంటి సూపు ఆనదాయె
ఒంటి ఎముకలరిగిపాయె
కన్నబిడ్డ లొదిలిపోయే
కన్నీళ్ళు వరదలై పారే
కండల్ని కరిగించీ, కొండల్ని పిండిగొట్టి
ఒంట్లో పేగులు పిండీ ,రక్తం ధారలు కట్టీ
‘పైసా’ పైసా కూడబెడ్తిరో, పిల్లగాళ్ళ నోటికింత కూడు బెడ్తిరో
మంచి మంచి బట్ట లిస్తిరో, ‘మనుషులు’గా సేసి నిలబెడితినిరో
అవసరాలు తీరాక అంతా నన్నొదిలిపాయెరో
నా పేద ‘బతుకు’ నడిరోడ్డు’పాలైనాదిరో
అణగారిన ‘బతుకు’లింతేనురో
‘అన్నమో రామచంద్రా!’ యని అలమటించురో
Also Read : సినిమా పాటను వివరిస్తూ నీతి కథ