My Dream : నా కల
నా కల
నా చేవ్రాలు
ఉట్టికి, స్వర్గానికి మధ్య ఊగిసలాడే మధ్యతరగతి జీవిని
ఎవరినో కాదు, నన్ను నేనే బాగుచేసుకోలేని దీనస్థితి
ఊపిరి జీవితమంతా ఊహాలోకంలోనే గడుస్తుంది
అందుకేనేమో పేగులు మాడుతున్నా కళ్ళు మూతపడతాయి
కమ్మని కలను కంటిముందు నిలిపి తృప్తి పరుస్తాయి
అందమైన అవుట్ హౌస్ లో అంగనల మధ్య ఉన్నట్లు,
ప్రమాణస్వీకారం చేస్తుంటే వందమంది వందనం చేస్తున్నట్లు,
గగనంలో గంధర్వకాంతతో కులాసాగ విహరిస్తున్నట్లు,
అభిమానుల కోలాహలం మధ్య ఆస్కార్ అందుకున్నట్లు,
వాస్తవం కాని వరదల్లాంటి మధుర స్వప్నాల మధ్య
వాస్తవానికి దగ్గరగా ఉండే తీయని కల ఒకటుంది నాకు
నా దేహం నిరుపయోగమైన పార్థివదేహం కాకూడదు
నాలోని ఒక్క అవయవమైనా సజీవమై నిలిచి
ఒక అసంపూర్ణ పుష్పాన్ని సంపూర్ణపుష్పం చేస్తే చాలు
నా జీవితానికి అర్థం, పరమార్థం దక్కుతుంది
ఆ స్వప్న సాకారానికి చేశాను
అంగీకారపు నా చేవ్రాలు
Also Read : నా బలం