Swayamkrushi : స్వయంకృషి
స్వయంకృషి
*** ఎదిగినా ఒదిగే ఉండు ***
కష్టాలను ఇష్టాలుగా మలసుకొని
ఒక్కో మెట్టు ఎక్కుతూ
అవకాశాలను సృష్టించుకొని
అవరోధాలను తప్పించుకొని
ఎటువంటి సమస్యనైనా
చిరునవ్వుతో జయిస్తూ
బలహీనతలను గమనిస్తూ
బలాలను బలగాలుగా మార్చుకొని
తప్పులను సరిచేసుకొంటూ
ఒప్పులతో ఒద్దికగా ఉంటూ
ప్రతీ మాటను ఆలకిస్తూ
ఒట్టి మాటను విడిసిపెట్టి
ఖచ్చితత్వం ను అభరణంగా
వేసుకొని
ఎదిగినా ఒదిగే ఉంటూ
ముందుకు అడుగులు వేసి
నన్ను నేను నిరంతరం మార్చుకుంటూ
స్వయంకృషితో
చేరా విజయతీరాలు
ఎగురవేసా కీర్తి పతాకం .
Also Read : నాతిచరామి