Nathicharami : నాతిచరామి
నాతిచరామి
నాతిచరామి
ధర్మేచా అంటూ పాటిస్తాను నా ధర్మాన్ని
తీసుకుంటాను ప్రతి దానిలో నీ అభిప్రాయాన్ని
నిను కాదని చేయనే చేయను నేను ఏ పనిని
కష్ట, సుఖములలో నేను నీ భాగస్వామిని.
కట్టుబాట్లు తప్పి విడువను నీ చేయిని
ధన,ధాన్యములకు లోటు రానీనని ఇస్తున్నా వాగ్దానాన్ని
అదుపు, పొదుపులను కూడా నేర్పించుకుని తీర్చి దిద్దుకుంటాను, నా ఇల్లాలివైన నిన్ని
కానీ ఖర్చెంత వున్నా కారానివ్వను నీ కంట కన్నీటిని.
ప్రతి ఆశని తీర్చలేనేమో కానీ,
నీ ప్రతి అవసరాన్ని గుర్తించి మసులుకుంటానని ఇస్తున్నా మాటని.
కట్టే కాలే దాకా పంచుకుంటాను నీతో నా జీవితాన్ని
ఆపై కూడా నేను కోరుకునేది నీవు బాగుండాలని.
Also Read : సుఖీభవ