సత్యం శివం సుందరం
అందమైన అసత్యాన్ని వడపోసి
చేదైన నిజానికై నిర్మలంగా నిలిచిన
మనసు దీపం మంగళకర మవుతుంటే
నీవే సత్యం.
లోలోని కలుషితాలను కడిగి
అంతఃకరణాన్ని శుద్ధిచేసి
మది కార్తీక పున్నమిలా వెలుగు వేళ
నీవే శివం.
మద మాత్సర్యాల మురుగును ప్రక్షాళించి
సహృదయత సమూలంగా అద్దగా
నిలువెల్లా నిర్మలత్వమే అలుముకుంటే
నీవే సుందరం.
అరిషడ్వర్గాలు నాశమై
నిర్వికారుడై నడయాడినపుడు
నీవే
సత్యం! శివం!! సుందరం
లోలోన సుగుణాలు సంపూర్ణమైతే,
నీవే సర్వం! నీవే ధర్మం
Also Read : శ్రీరామ నవమి పండగ విశిష్టత