కలం – గళం
ఊహకు ప్రతిరూపం కవిత
కవితకు రూపం అక్షరం
అక్షరానికి ఆయువు కలం
కలం కలకాలం గుర్తుండేలా
చేయగలిగేది గళం
ఆశయం ఉప్పెనలా విజృంభిస్తున్న వేళ
కష్టాలు కన్నీరై ధారగా ప్రవహిస్తున్న వేళ
తోడుగా నిలిచి దారి చూపేది కలం
కలానికి ధైర్యాన్నచ్చి ,
అందరికీ అండగా నిలిచి
ఎదురొడ్డి పోరాడేది గళం
కరిగిపోతున్న కాలానికి సాక్ష్యం కలం
భవిష్యత్తు ఆశలకు ప్రేరణ గళం
ఆనందం ,ఆవేశం ,బాధ, కన్నీరు,
ఆలోచనలు ఎన్నున్నా
ఆశయాలు తోడైనా
అన్ని వేళలా నీకు తోడుగా నిలిచేది కలం
ఆ కలానికి రూపాన్నిచ్చేది గళం .
Also Read : నేను సైతం